ఔటర్ ప్రయాణంలో ‘టీ-వాలెట్’

Wed,December 6, 2017 07:49 AM

Payment via T-wallet at toll plazas on outer ring road

హైదరాబాద్ : గ్రేటర్ మణిహారమైన ఔటర్ రింగు రోడ్డు ప్రయాణంలో టీ-వాలెట్‌ను హెచ్‌ఎండీఏ ప్రవేశపెట్టింది. డిజిటల్ లావాదేవీల చెల్లింపులో భాగంగా ప్రభుత్వ ప్రవేశపెట్టిన టీ-వాలెట్‌ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా హెచ్‌ఎండీఏ అధికా రులు ఔటర్ టోల్ వసూలు కేంద్రాల వద్ద ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకుచ్చారు. పేటీఎం తరహాలోనే టీ-వాలెట్ ద్వారా సదరు వాహనదారులు టోల్ రుసుంను చెల్లించ నున్నారు.

156.9 కిలోమీటర్ల మేర ప్రయాణంలో 19 ఇంటర్‌ఛేంజ్‌లలోని 181లేన్లలో 65లేన్లలో ఇప్పటికే ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్లు (ఆర్‌ఎఫ్‌ఐడీ-ఈటీసీ) విధానానికి శ్రీకారం చుట్టి ప్రయోగాత్మకంగా ఇటీవల శంషాబాద్ నుంచి నానక్‌రాంగూడ మార్గంలో ప్రవేశపెట్టి స్మార్ట్ ప్రయాణానికి వీలు కల్పించారు. ఇందులో భాగంగానే మ్యాన్‌వల్ చెల్లింపులను సులభతరం చేస్తూ టీ-వాలెట్‌ను ప్రవేశపెట్టినట్లు ఔటర్ విభాగం అధికారులు తెలిపారు. స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు.

1271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles