అమర జవాన్లకు ఘన నివాళి

Sat,February 16, 2019 08:09 PM

pay tribute to crpf martyrs in Telangana statewide

హైదరాబాద్‌: తీవ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన భారత జవాన్ల మృతికి సంతాపంగా ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలకేంద్రంలో ఎమ్మెల్యే కోనేరు కొనప్ప ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తీవ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అదేవిధంగా నగరంలోని పెండేకంటి లా కళాశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ వై.ఎఫ్‌ జయకుమార్‌, విద్యార్థులు అమర్‌ యాదవ్‌, ప్రవీణ్‌ దుప్పటి, నరేష్‌ కుమార్‌ జెల్ల, అరవింద్‌, శేషు, రాహుల్‌, తిరుపతి, సాగర్‌ పాల్గొన్నారు.

1521
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles