రేవంత్ రెడ్డిపై పట్నం నరేందర్ రెడ్డి గెలుపు

Tue,December 11, 2018 02:01 PM

Patnam Narender reddy wins from Kodangal

హైదరాబాద్ : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 10,770 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పట్నం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గం నుంచి 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని రేవంత్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్ చెప్పిన విషయం విదితమే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ ప్రజల పక్షాన బాధ్యతయుతంగా ఉండి పోరాటం చేస్తామన్నారు. ఓడిపోతే కుంగిపోవడం.. గెలిస్తే ఉప్పొంగిపోవడం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదన్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.

5794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles