రిమ్స్ మూడో అంతస్తు నుంచి దూకి రోగి ఆత్మహత్య

Fri,May 17, 2019 11:33 AM

patient suicide in adilabad rims hospital

ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ కళాశాల మూడో అంతస్తు నుంచి దూకి రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పై నుంచి పడగానే గమనించిన సిబ్బంది అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ రోగి మృతి చెందాడు. మృతుడు మూడు రోజుల క్రితం రిమ్స్‌లో చికిత్స నిమిత్తం చేరిన తలమడుగు మండలం కజ్జర్లవాసి నారాయణగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

603
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles