పారుపల్లి శ్రీనివాస్‌కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు

Tue,August 20, 2019 06:30 AM

Parupalli Srinivas has a place in the Telugu Book of Records

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలోని శ్రీనివాసపురానికి చెందిన ఆంగ్ల ఆచార్యులు డా.పారుపల్లి శ్రీనివాసరావు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్‌లో దేశంలోనే ఒక విద్యాసంవత్సరంలో ఏకైక రచయితగా 42 పరి శోధనాత్మక వ్యాసాలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురించి ప్రతిష్టాత్మక తెలుగు బుక్ రికార్డులో చోటు సాంపాదించారు. ఈ రికార్డులో ఒకే సంవత్సరంలో అత్యధిక పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించిన ఏకైక రచయిత అనే ప్రత్యేక విభాగంలో రికార్డును నమోదు చేసిన్నట్లు ఆ సంస్థ వ్యవ స్థాపకులు డా.చింతపట్ల వెంకటాచారి వెల్లడించారు. సోమవారం లాలా పేటలోని తన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన శ్రీనివాసరావుకు రికార్డు ధృవీకరణపత్రం, జ్ఞాపిక, బంగారు పతకాన్ని అందజేశారు.

448
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles