ఇవాళ సా. 5 గంటల నుంచి సభలు నిషేధం

Wed,December 5, 2018 02:37 PM

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఈ నెల 7న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి బహిరంగ సభలు నిర్వహించడం నిషేధం అని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు. సమస్యాత్మకమైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల నుంచే సభలను నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్ కు 48 గంటల ముందు నుంచే ప్రశాంతంగా ఉండాలి. సభలు, ఊరేగింపులు, సినిమా, టీవీల ద్వారా ఎన్నికల సందేశాలు ప్రసారం చేస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లే. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, జరిమాన విధిస్తామని రజత్ కుమార్ స్పష్టం చేశారు.

2058
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles