చేప ప్రసాదం కోసం వచ్చేవారి వాహనాల పార్కింగ్ స్థలాలు

Sat,June 8, 2019 08:29 AM

Parking spaces for fish prasadam in hyderabad

హైదరాబాద్ : చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా 8,9వ తేదీలలో నాంపల్లిలో ఎగ్గిబిషన్ మైదానికి వచ్చే వాహనదారులకు పార్కింగ్ విషయంపై నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పలు సూచనలు చేశారు.
కార్లపై నాంపల్లి వైపు నుంచి చేప ప్రసాదం పంపిణీ కేంద్రానికి వచ్చే వారు తమ వాహనాలను గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్‌లో పార్కు చేసి అజంతా గేట్ నం. 2 నుంచి గ్రౌండ్‌లోకి వెళ్లాలి. ఎంజే మార్కెట్ వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను ఎంఏఎం బాలికల జూనియర్ కాలేజీ ప్రాంగణంలో పార్కు చేయాలి.
* బస్సులు, వ్యాన్లలో ఎంజే మార్కెట్ వైపు నుంచి వచ్చే వారు గాంధీభవన్, నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు గృహకల్ప బస్‌స్టాప్‌లో ఆగాలి. అక్కడి నుంచి నడుచుకుంటూ పంపిణీ కేంద్రానికి వెళ్లాలి.
* వీఐపీ కారు పాసులు ఉన్న వారు ఎంజే మార్కెట్ వైపు నుంచి వచ్చే వారు గేట్ నం. 1 నుంచి, నాంపల్లి నుంచి వచ్చే వారు గాంధీభవన్ నుంచి గేట్ నం. 1 ద్వారా వీఐపీ వాహనాల పార్కింగ్ వద్దకు సీడబ్ల్యూసీ గోడౌన్స్ వద్ద పార్కు చేయాలి.
* ప్రసాదం తీసుకున్న వారు వీఐపీలు వీఐపీ గేట్ నుంచి అదాబ్ హోటల్ నుంచి నాంపల్లి వైపు వెళ్లాలి.
* ద్విచక్రవాహనాలపై వచ్చే వారు మనోరంజన్ కాంప్లెక్స్ పార్కింగ్ ఏరియా, ప్రధాన రోడ్డుపై మార్కు చేసిన గృహకల్ప నుంచి బీజేపీ అఫీస్ మధ్య పార్కింగ్ చేసుకోవాలి.
* ఆటోలు సహజాన్ హోటల్, భవానీ వైన్స్, జువెనల్ కోర్టు, ఎక్సైజ్ ఆఫీస్, ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతంలో పార్కు చేయాలి.
* ప్రభుత్వ వాహనాలు భీమ్‌రావువాడ, నాంపల్లి ప్రాంతంలో పార్కు చేయాలి.
* ఎం.జే మార్కెట్ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను అబిడ్స్ జీపీవో వైపు, నాంపల్లి స్టేషన్ రోడ్డు లో మళ్లిస్తారు.
* ఎంజే బ్రిడ్జి, బేగంబజార్ ఛత్రి నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను అలస్క వద్ద దారుసలాం, ఎక్‌మినార్ వైపు మళ్లిస్తారు.
* పీసీఆర్ జంక్షన్ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద, బీజేఆర్ విగ్రహం వైపు మళ్లిస్తారు.
* వాటర్ వర్క్స్, ఫిష్‌రీస్ డిపార్టుమెంట్‌కు సంబంధించిన వాహనాలను గేట్ నం.2 నుంచి లోపలికి వెళ్లాలి.
* ఆహారపు పదార్థాలను రవాణా చేసే వలంటరీ అర్గనైజేషన్లు గేట్ నం.2 నుంచి లోపలికి వెళ్లాలి.

997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles