పండుగ సెల‌వుల్లో పొలానికొస్తే..బాల‌కార్మికుల‌ని ప‌ట్టుకెళ్లారు!

Sun,January 13, 2019 10:31 AM

Parents of the girls stayed before Bala Sadan for several hours

గద్వాల: పండుగ సెలవుల సందర్భంగా ఇంటి వ‌ద్ద‌, పొలాల దగ్గర ఉన్న తమ పిల్లలను బాల కార్మికులు అంటూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు బాల సదన్‌కు తరలించడాన్ని నిరసిస్తూ శ‌నివారం పిల్లల తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలోని బాల స‌ద‌న్‌ ముందు ఆందోళన నిర్వహించారు.

సంక్రాంతి సెలవులు ఉండడంతో తమ పిల్లలు ఇంటికి వచ్చారని వారు ఇంటి దగ్గర ఖాళీగా ఉండలేక తమ వెంట పొలాలకు వస్తే మాకు తెలియకుండా మా పిల్లలను బాలసదన్‌కు ఎలా తరలిస్తారని అక్కడ ఉన్న అధికారితో బాలికల తల్లి దండ్రులు వాగ్వాదానికి దిగారు. తమ బాలికలను బాల సద‌న్ నుంచి తమ వెంట పంపే వరకు తాము ఇంటికి వెళ్లేది లేదని వారు అక్కడే బైఠాయించారు. అయితే బడికి వెళ్లకుండా పనులు చేయిస్తున్న పిల్ల‌ల‌ను పోలీస్‌శాఖ‌, జిల్లా సంక్షేమశాఖ, కార్మిక శాఖల ఆధ్వర్యంలో వారిని బాలసదన్‌కు తరలిస్తున్నారు.

రెండు రోజులుగా గద్వాల, అయిజ ప్రాంతంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో అయిజ మడంలంకు చెందిన తులసికి తల్లి దండ్రులు లేరు.. తన నానామ్మ దగ్గర ఉంటుంది. ఆ బాలిక పదో తరగతి వరకు చదువుకుంది. నానమ్మకు చేదోడు వాదొడుగా ఉంటుంది. ఆ బాలిక బాలకార్మికులుగా పని చేస్తుందని అయిజ నుంచి గద్వాల బాలస దన్‌కు రెండు రోజుల కిందట తరలించడంతో ముసలమ్మ బాల సద‌న్ ముందు కూర్చొని మనవరాలి కోసం ఎదురు చూస్తు ఉండిపోయింది.

అలాగే కొండా పురానికి చెంది నరేణమ్మ సెలవులకు ఇంటికి వెళ్లింది. సంక్రాంతి పండుగకు ముగ్గులు తెచ్చు కుందామని చేను దగ్గర ఉన్న తన తల్లి దగ్గరకు డబ్బులు తెచ్చుకోవడానికి వెళితే అక్కడ పొలంలో పని చేస్తుందని చెప్పి ఆ బాలికను బాల సద‌న్‌కు తరలించారు. బాల సదనంలో రెండు రోజులుగా ఉంటున్న ఆ అమ్మాయి తనను తన తల్లి దండ్రుల దగ్గరకు పంపించండి అని ఏడుస్తూ ఉన్నా అధికారులు పంపించలేదని వాపో యింది. అధికారులు వాస్తవంగా పొలాలు, మిల్లుల్లో పని చేస్తున్న బాల కార్మికులను పట్టించుకోకుండా సెలవుల కోసం ఇంటికి వచ్చిన తమ పిల్లలను బాల కా ర్మికులని బాల సద‌న్ తీసుకపోవడం ఏమిటని బాలికల తల్లి దండ్రులు ప్రశ్ని స్తు న్నారు.

తమ పిల్లలు చదువుతున్నట్లు ధ్రువపత్రాలు చూపించినా అధికారులు పట్టించుకోవడం లేదని బాలికల తల్లిదండ్రులు వాపో యారు. దీనిపై డీసీ పీవో కుసుమ లతను వివరణ కోరగా బాలికల సంక్షేమం కోసమే వారు పొలాల్లో పని చేయకుండా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం, అందుకే బాల కార్మికులను బాల సద‌న్‌కు తరలించాం తప్పా వేరే ఉద్దేశం లేదు. బాలికలు చదు వుకుంటున్నట్లు బోన ఫైడ్ చూయిస్తే ఉన్నత అధికారుల ఆదేశం మేరకు వారిని వారి తల్లిదండ్రుల వెంట పంపిస్తామని చెప్పారు.

1906
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles