లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయితీ కార్యదర్శులు

Thu,April 4, 2019 02:05 PM

Panchayat Secretaries ACB caught by acb net

రంగారెడ్డి: జిల్లాలోని పుప్పాలగూడ పంచాయతీ కార్యదర్శులు,ఎంపీటీసీ సభ్యులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రూ.2లక్షలు లంచ తీసుకుంటుండగా అవినీతి నిరోదక శాఖ అధికారులు పట్టుకున్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఎంపీటీసీ శివప్రసాద్, పంచాయతీ కార్యదర్శి శివయ్యలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు ఈ రోజు లంచం తీసుకుంటుండగా వీరిద్దరితో పాటు మరో కార్యదర్శిని అదుపులోకి తీసుకున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచించారు.

2753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles