కాంగ్రెస్‌కు పాలేరు ఎమ్మెల్యే గుడ్‌బై.. త్వరలో టీఆర్‌ఎస్‌లోకి

Thu,March 14, 2019 03:19 PM

Paleru mla upender reddy meets with trs working president ktr

హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వర్‌రావుపై గెలిచిన కందాల ఉపేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నేడు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. త్వరలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని ఇద్దరు ఎమ్మెల్యేలు వీడారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు టీడీపీ నుంచి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్దమైన విషయం తెలిసిందే.

1713
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles