పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి కన్నుమూత

Thu,August 9, 2018 02:57 PM

palakurthi Narasimha Siddhanti passed away

హైదరాబాద్: ప్రముఖ వేద పండితులు పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి కన్నుమూశారు. జనగామ జిల్లా కొడగంట్లలో అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. జ్యోతిష్య, ఆగమ శాస్ర్తాల్లో సిద్ధాంతి ప్రావీణ్యులు. పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి వేలాది ఆలయాల్లో దేవతామూర్తుల ప్రతిష్ఠాపన నిర్వహించారు. అనేక వేద సభల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ర్టాల్లో ప్రముఖులచే సన్మానాలు అందుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్ సిద్ధాంతిని సన్మానించి ధార్మికవరేణ్య బిరుదుతో సత్కరించారు. పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సిద్ధాంతితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొండా సురేఖ, వినయ్‌భాస్కర్ సిద్ధాంతి మృతిపట్ల సంతాపం తెలిపారు.

1410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles