పగిడివాగు వంతెన పేల్చివేత.. మావోయిస్టుల దుశ్చర్య

Wed,April 25, 2018 06:53 PM

Pagidivaagu bridge demolished by Maoists in bhadradri kothagudem dist

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని చర్ల మండల పరిధిలోని పెదమిడిసిలేరు సమీపంలోని పగిడివాగుపై నిర్మించిన లోలెవల్ వంతెన(చప్టా)ను మంగళవారం రాత్రి మావోయిస్టులు పేల్చివేశారు. రాత్రి రెండు గంటల సమయంలో సాయుధులైన మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చప్టా కింది భాగంలో శక్తివంతమైన మందుపాతరలు అమర్చి పేల్చి వేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమచారం.

చప్టా ధ్వంసం కావడంతో రెండు వైపులా రవాణా సౌకర్యం నిలిచిపోయింది. రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మందుపాతర పేలిన సమయంలో వచ్చిన శబ్దానికి సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాలుగు దశాబ్దాలక్రితం నిర్మించిన ఈ చప్టా ద్వారా నిత్యం వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. చప్టా పేల్చివేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇటీవల సుప్రీం కోర్టు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట సవరణకు పూనుకోవడానికి నిరసనగా బుధవారం నిరసన దినం పాటించాలని మంగళవారం చర్ల, శబరి ఏరియా కమిటీ పేర్లతో చిన్నమిడిసిలేరు, అంజనాపురం గ్రామాలతో పాటు అటవీ ప్రాంతంలో వాల్‌పోస్టర్లు వెలసిన సంగతి విదితమే.

2448
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS