భారీ వర్షాలు..పొంగిపొర్లుతున్న వాగులు

Mon,July 17, 2017 09:21 PM


హైదరాబాద్ : నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. వర్షం కారణంగా భద్రాద్రి కొత్తగూడెంలోని మొర్రేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లాలోని శాయంపేటలో చలివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. వరద నీరుతో ప్రాజెక్టు నీటి మట్టం 19 అడుగులకు చేరింది.
bdg-cheruvu1
bgd-cheruvu
chalivagu

1906

More News