మన అప్పులే తక్కువ

Sun,November 25, 2018 09:30 AM

Our debts is less compared to southern states

హైదరాబాద్: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఇతర దక్షిణాది రాష్ర్టాలకు ఉన్న అప్పులతో పోలిస్తే ఇక్కడ తక్కువగా ఉన్నాయని, గత ఆర్థిక సంవత్సరానికి గాను విడుదల చేసిన తాజా గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది. గత ఆర్థిక సంవత్సరం (2017-18) రాష్ట్ర స్థూల జీడీపీలో రుణాల వాటా 22.2 శాతంగా ఉన్నట్లు తెలియజేసింది. ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల జీడీపీలో అప్పులు 27.3 శాతంగా ఉన్నట్లు తేలింది. తమిళనాడు రుణాలు 23.2 శాతంగా ఉంటే, కేరళ అప్పులు ఆ రాష్ట్ర స్థూల జీడీపీలో 32.4 శాతంగా ఉండటం గమనార్హం. ఇదిలావుంటే రుణాల రద్దు, మితిమీరిన వ్యయం రాష్ర్టాల రుణ భారాన్ని పెంచుతున్నాయని, వీటి విషయంలో కాస్త జాగ్రత్త అవసరమని ఈ సందర్భంగా ఆర్బీఐ ఆయా రాష్ర్టాలకు సూచించింది.

1434
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles