రాహుల్ గాంధీ భేటీ ఆగమాగం.. తన్నుకున్న ఓయూ విద్యార్థులు

Tue,August 14, 2018 02:22 PM

ou students fighting in the hotel

హైదరాబాద్: తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు అనుమతి లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మరోసారి పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. హరితప్లాజాలో రాహుల్ గాంధీ భేటీ ఆగమాగమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పత్రికా సంపాదకులతో రాహుల్ సమావేశం జరుగుతుండగా.. ఆ వేదిక వద్దకు జానారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది ఆపినట్లు సమాచారం. దీంతో ఆయన అలకబూని.. బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న గూడురు నారాయణ రెడ్డి జానారెడ్డిని బతిమాలి లోపలికి పంపించినట్లు తెలుస్తుంది.

పార్టీ సీనియర్ల సమావేశానికి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని అనుమతించకపోవడం వివాదస్పదమైంది. సీనియర్ల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వీరిద్దరికి పాస్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తనను సీనియర్ గా గుర్తించకపోవడంపై రేవంత్ ఆగ్రహం వెలిబుచ్చినట్లు సమాచారం. సునీతా లక్ష్మారెడ్డి కంటతడిపెట్టి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.

ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల(కాంగ్రెస్ మద్దతుదారులు)తో జరగాల్సిన భేటీ కూడా రద్దు అయినట్లు సమాచారం. రాహుల్ తో భేటీ కంటే ముందే కాంగ్రెస్ మద్దతుదారులైన విద్యార్థులు.. రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.

5916
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles