పుట్ట మధు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు

Sun,September 30, 2018 06:26 PM

other party leaders join in trs party in the presence of putta madhu

పెద్దపల్లి: మంథని నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులకు తోడు పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ మంథని అభ్యర్థి పుట్ట మధు అన్నారు. ఇవాళ జిల్లాలోని మంథనిలోని తన నివాసం వద్ద ముత్తారం మండల కేంద్రం, కాసర్లగడ్డ గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి పుట్ట మధు టీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి పక్ష పార్టీలు ఖాళీ అవుతున్నాయన్నారు. ప్రతీ రోజూ పార్టీలో చేరేందుకు అనేక మంది వివిధ పార్టీల నుంచి వచ్చి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శివశక్తి యూత్ అధ్యక్షుడు అమ్ము రమేష్, ఉపాధ్యక్షుడు తాత కుమార్, శీలం రవి, శీలం కుమార్, అమ్ము శ్రీనివాస్, అమ్ము కుమారస్వామి, జింకిరి కుమార్ పాల్గొన్నారు.

2462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles