గులాబీ దండు ఉంటేనే గులాంగిరీ పోతుంది: ఎంపీ కవిత

Mon,March 18, 2019 12:42 PM

other party leaders join in trs party in the presence of mp kavitha in jagtial

జగిత్యాల: గులాబీ దండు ఉంటేనే గులాంగిరీ పోతుందని ఎంపీ కవిత అన్నారు. ఇవాళ జగిత్యాలలో ఎంపీ కవిత సమక్షంలో పలు పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం మాట్లాడిన కవిత.. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. మన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరినీ ఆకర్షిస్తున్నాయన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ మీద కూడా గులాబీ జెండా ఎగరాలన్నారు.

టీఆర్‌ఎస్ ఎంపీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. 71 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. మనకన్నా చిన్నదేశాలు, పేదదేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే 24 గంటల కరెంట్ సాధ్యమైంది. ఐదేళ్లలో బీజేపీ సర్కార్ ప్రజలకు చేసింది ఏమీ లేదు. బీజేపీ నేతలకు ఎన్నికలప్పుడే రాముడు గుర్తుకొస్తడు. జాతీయ పార్టీలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవానులకు రూ.25 లక్షల చొప్పున ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.

ఐదేళ్లలో రాష్ట్రంలో ఆయకట్టును పెంచుకోగలిగినం. నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్‌లో రూ.2800 కోట్లు కేటాయించాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు సీఎం కేసీఆర్. ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లో ఉంటే దేశం బాగుపడుతుంది. తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచింది. మోదీ దేశ ప్రజలను మభ్య పెడుతున్నారు. ప్రధాని మోదీ ఐదేళ్లు పనిచేయకుండా ఎన్నికల ముందు అనేక కార్యక్రమాలు ప్రారంభిస్తున్నరు. పేదలను అన్ని రకాలుగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఎంపీ కవిత తెలిపారు. ఈసందర్భంగా ఎంపీగా బరిలో నిలిచిన కవితకు పలు కులసంఘాలు మద్దతు తెలుపుతూ ఎన్నికల ఖర్చు నిమిత్తం చెక్కును అందజేశారు.

1589
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles