టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు..

Sat,March 17, 2018 09:52 PM

other party leaders join in trs in the presence of mla muthireddy

జనగామ: వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్ గ్రామంలో కాంగ్రెస్ మండల నాయకులు ఎంపీపీ బైరగోని యాదగిరిగౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు బాల్దె సిద్దిలింగం అధ్వర్యంలో 40 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్శితులైన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతోందని, సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి, యాదవ సంఘం జిల్లా నాయకులు వజ్జ పరశురాములు, ఉప సర్పంచ్ చొప్పరి రాజు తదితరులు పాల్గొన్నారు.

2480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS