మల్లన్నసాగర్‌పై ప్రతిపక్షాలది అనవసర రాద్దాంతం: వి.ప్రకాశ్

Sun,June 19, 2016 01:10 PM

oppositions are un necessarily opposing mallannasagar : v. prakash

హైదరాబాద్: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నిజాంసాగర్ ఎండిపోయిందని రాజకీయ విశ్లేషకులు వి.ప్రకాశ్ అన్నారు. 1956 నుంచి 1983 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని వారి పాలనలోనే నిజాం సాగర్ ఎండిపోయిందని తెలిపారు. హైదరాబాద్‌లోని ఆంధ్రా ఫ్యాక్టరీలకు, ఆంధ్రా కంపెనీలకు నీల్లు ఇవ్వాలనే దురుద్దేశ్యంతో సింగూరు ప్రాజెక్టు కట్టి నిజాంసాగర్‌కు నీళ్లు రాకుండా చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో వ్యవసాయం కుంటుపడిందని మండిపడ్డారు. హైదరాబాద్‌కు 4 టీఎంసీల నీటి పేరుతో 30 టీఎంసీల నీటిని ఆపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మల్లన్నసాగర్ సాధన కోసం ఇవాళ తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఆర్టీసీ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వల్ల నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతులకు ఎంతో ఉపయోగమని తెలిపారు. మల్లన్న సాగర్‌పై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్, టీడీపీ ఉచ్చులో పడి మోసపోవద్దని సూచించారు.

దేవునూరు ప్రాజెక్టు కింద సుమారు 3 లక్షల ఎకరాలు సాగయ్యేదని తెలిపారు. నీలం సంజీవరెడ్డి సీఎం కాగానే దీనిని రద్దు చేయించాడని దీంతో రైతులు కష్టాలపాలయ్యారని పేర్కొన్నారు. ఆనాడు వాళ్లు ప్రాజెక్టులు ఎండగొట్టారు కాబట్టే ఇవాళ మనం మల్లన్నసాగర్ కట్టుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్, టీడీపీల నిర్వాకం వల్లే ఈ దుస్తితి ఏర్పడిందన్నారు. వాళ్ల పాప ప్రక్షాళన కోసం సహకరించాల్సిందిపోయి ఇవాళ మళ్లీ మల్లన్నసాగర్‌ను అడ్డుకుంటున్నారని తెలిపారు. గొలుసుకట్టు చెరువులను కాపాడుకుని ఉంటే ఇవాళ మన రైతులకు ఈ దుర్బర స్థితి ఉండేది కాదన్నారు.

1323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS