ఎన్నికలంటే విపక్షాలు జంకుతున్నాయి: వేణుగోపాలాచారి

Wed,September 19, 2018 07:50 PM

Opposition parties are afraid of elections says Venugopala chary

ఢిల్లీ: విపక్షాలు ఎన్నికలంటే జంకుతున్నాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. రాష్ట్రంలో విపక్ష పార్టీల తీరుపై ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏకవాక్య తీర్మానాలు చూసి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి మతి భ్రమించిందన్నారు. కాంగ్రెస్ నేతలకు ప్రభుత్వ పనితీరు, పథకాలపై అవగాహన లేదన్నారు. టీఆర్‌ఎస్‌కు ఉన్న మద్దతు చూసిన కాంగ్రెస్ తన జాబితాను కూడా విడుదల చేయలేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక పొత్తులకు సిద్ధమైందని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంది కాంగ్రెస్సే అన్నారు. జీహెచ్‌ఎంసీలో ఒక్క సీటు రాని బీజేపీ.. టీఆర్‌ఎస్‌కు ఏ మాత్రం పోటీకాదని తెలిపారు. విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని.. సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు ప్రధానిని కలిసినా రాష్ట్ర సమస్యలపై మోదీ దృష్టి సారించలేదని పేర్కొన్నారు.

1449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS