సైబరాబాద్‌లో అపరేషన్ స్మైల్..

Mon,June 17, 2019 10:24 PM

operation smile in hyderabad police commissioner limits

హైదరాబాద్ : బాలబాలికలను వెట్టీ చాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సారధ్యంలో ఏర్పాటు చేసిన అపరేషన్ స్మైల్ ఏడాది పూర్తి చేసుకుంది. షీ టీమ్స్ నేతృత్వంలో పనిచేసిన అపరేషన్ స్మైల్ టీం 581 మందికి భిక్షాటన, చిత్తుకాగితాల సేకరణ, బాలకార్మికులు, అదృశ్యమైన పిల్లలు, పోక్సో కేసులు, బాల్య వివాహాల బారిన పడ్డ వారిని కాపాడి వారికి కొత్త జీవితాన్ని అందించారు.ఈ విధంగా పసిపిల్లలకు అండగా ఉండేందుకు సైబరాబాద్‌లో అపరేషన్ స్మైల్ టీం మూడు జోన్‌లలో 24/7 అందుబాటులో ఉన్నారు. ప్రత్యేక వాట్సాప్ నెం. 7901115474ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నెంబరుకు సమాచారం వస్తే చాలు అపరేషన్ స్మైల్ బృందాలు రంగంలోకి దిగి బాలబాలికలను వేధింపులు, కష్టాల బారిన నుంచి కాపాడి వారిని పునరావస కేంద్రాలు, తల్లిదండ్రులకు అప్పగించారు.జూన్ 18-2018 నుంచి జూన్ 17-2019 వరకు అపరేషన్ స్మైల్ బృందం ద్వారా వెట్టీ చాకిరీ, నిర్భంధ జీవితాన్ని నుంచి బయటపడ్డ వివరాలు ఇలా ఉన్నాయి.

1620
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles