ఆన్‌లైన్ స్నేహాన్ని నమ్మి...

Fri,July 13, 2018 06:20 AM

online friendship fraud

హైదరాబాద్ : ఆన్‌లైన్ స్నేహాన్ని నమ్మిన ఓ యువతి రూ.8 లక్షలు పోగొట్టుకున్నది. హైదరాబాద్ కొండాపూర్‌లో ఉంటున్న ఓ హెడ్‌కానిస్టేబుల్ కూతురుకు గుర్తు తెలియని వ్యక్తి ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు. మూడు నెలల చాటింగ్‌తో ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. ఓ రోజు అవతలి వ్యక్తి ఖరీదైన బహుమతి పంపిస్తున్నానని చెప్పాడు.

దీంతో ఆ యువతి ఆనందంలో మునిగింది. వారం రోజుల కిందట ఆ యువతికి ఓ వ్యక్తి ఫోన్‌చేసి కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మీకు ఖరీదైన బహుమతి వచ్చిందని, సరైన క్లియరెన్స్ సర్టిఫికెట్లు లేని కారణంగా కస్టమ్స్ కార్యాలయంలో నిలిపివేశామని చెప్పాడు. క్లియర్ కావాలంటే ఆన్‌లైన్‌లో డబ్బు పంపాలని సూచించాడు.

ఇలా పలు సర్టిఫికెట్ల పేరుతో యువతి నుంచి మొత్తం రూ.8 లక్షలు కాజేశారు. ఇటీవల ఆమె తండ్రి ఓ ఇంటిని అమ్మగా వచ్చిన నగదును సైబర్ చీటర్లకు ధారపోసింది. చివరకు తాను మోసపోయినట్టు గుర్తించిన బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు చేస్తుండగానే సైబర్ చీటర్లు ఫోన్ చేశారు. మరో రూ.5 లక్షలు జమ చేస్తే రూ.కోట్ల విలువైన బహుమతిని పంపిస్తామని చెప్పారు.

2351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles