ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

Wed,August 14, 2019 08:58 PM

ongoing flood into the Yellampalli project

అంతర్గాం : పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద కొనసాగుతున్నది. నాలుగు రోజులుగా రెండు గేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేసిన అధికారులు, వరద తగ్గడంతో ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇన్‌ఫ్లో నిలిచిపోగా, మధ్యాహ్నం 3 గంటలకు 15444 క్యూసెక్కులు, 4 గంటల నుంచి 6 గంటల వరకు 7722 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.5086 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.

1025
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles