ఒక నెల జీతాన్ని వితంతువులకు ఇస్తున్నా : హరీష్‌రావు

Fri,June 23, 2017 01:54 PM

one month salary give to Widows, says Harish Rao

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వితంతు మహాసభ జరిగింది. వితంతువులపై వివక్షను నిరసిస్తూ ఏర్పాటు చేసిన ఈ మహాసభలో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. దేశంలోనే తొలిసారిగా 10 వేల మంది వితంతువులతో మహాసభను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. వితంతువుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. భర్త చనిపోయిన తర్వాత మళ్లీ వివాహం చేసుకోవడం తప్పుకాదన్నారు.

వితంతు వివాహాలపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. ఒక నెల జీతాన్ని వితంతువులకు ఇస్తున్నానని ప్రకటించారు మంత్రి. మహిళల రక్షణ కోసం గ్రామాలకు షీ టీమ్స్‌ను విస్తరిస్తున్నామని తెలిపారు. బాల్యవివాహాల వల్ల వితంతువుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న గుడుంబాను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. గుడుంబాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉద్ఘాటించారు. కల్యాణలక్ష్మి వల్ల బాల్య వివాహాలు ఆగిపోతున్నాయని తెలిపారు. సామాజిక దురాచారాల నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు.

1606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles