ట్రాక్టర్ బోల్తా: ఒకరు మృతి.. మరొకరికి గాయాలు

Sat,April 13, 2019 09:27 PM

one died in tractor accident

పెన్‌పహాడ్ : కంపచెట్లను తప్పించబోయి అదుపు తప్పిన ట్రాక్టర్ చెరువులోకి పల్టీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని అనాజిపురం గాండ్ల చెరువులో జరిగింది. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనుములపురి రమేష్ తన ట్రాక్టర్ ద్వారా వరి గడ్డి తోలుకురావడానికి కూలీలతో వ్యవసాయ బావి వద్దకు బయలుదేరారు.

ట్రాక్టర్ నడుపుతున్న రమేష్ చెరువుకట్టపై అలుముకున్న కంపచెట్లను తప్పించుకుంటూ వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులోకి పల్టీ కొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ తొట్టిలో కూర్చున్న లక్కపాక నర్సయ్య(45)అక్కడిక్కడే మృతి చెందగా, అనుములపురి శ్రీను, మణెమ్మలు నీటిలోకి దూకారు. డ్రైవర్ రమేష్ ట్రాక్టర్ పక్కన పడడంతో స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

1699
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles