బస్సు బీభత్సం: ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

Sat,January 12, 2019 07:08 PM

one dead three injured in road accident at secunderabad passport office

సికింద్రాబాద్: ప్రశాంత్ థియేటర్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫేయిల్ అయి బస్సు డివైడర్‌ను దాటింది. ఎదురుగా వస్తున్న ఆటోలు, ద్విచక్రవాహనంపైకి బస్సు దూసుకెళ్లి మెట్రో పిల్లర్‌ను ఢీకొని ఆగిపోయింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ట్రాఫిక్ పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరగడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

1916
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles