మళ్లీ మీరే మా ఎమ్మెల్యే.. నిండు మనస్సుతో దీవించిన వృద్ధుడు

Wed,November 14, 2018 09:43 PM

Old man donated his pension amount to trs candidate rajaiah in station ghanpur

నామినేషన్ కోసం రూ. 5,016 విరాళం ఇచ్చిన చిట్యాల ఎల్లయ్య
స్టేషన్‌ఘన్‌పూర్: మళ్లీ మా కాబోయ్యే ఎమ్మెల్యే మీరేనయ్యా అంటూ ఓ వృద్ధుడు నిండు మనస్సుతో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్యను దీవించారు. నామినేషన్ కోసం తన ఐదు నెలల పింఛన్ డబ్బులు రూ. 5,016 విరాళంగా ఆయనకు అందజేశారు చిల్పూరు మండలం వంగాలపల్లికి చెందిన చిట్యాల ఎల్లయ్య. బుధవారం తాటికొండ రాజయ్య నామినేషన్ వేయనున్న సందర్భంగా హన్మకొండలోని ఆయన నివాసానికి వెళ్లి డబ్బులు అందజేశారు. అదే మండలం రాజవరం గ్రామానికి చెందిన రైతు క్లబ్ సభ్యులు సైతం రూ.5,016 విరాళంగా అందజేశారు.

3950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles