వడదెబ్బతో వృద్ధుడి మృతి

Sat,May 5, 2018 07:11 PM

Old man died with sun stroke in peddapalli district

పెద్దపల్లి: జిల్లాలోని ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు అవునూరి స్వామి (70) వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. స్వామి ఇవాళ ఉదయం నుంచి ఎండలో బర్రెను మేపేందుకు బయటకు వెళ్లాడనీ, సాయంత్రం ఇంటికి వచ్చి అస్వస్థతకు గురైనట్లు పేర్కొన్నారు. ఎండలో పోయి వచ్చి మంచంలో కూర్చుని మంచినీళ్లు తాగి ఒక్కసారిగా ప్రాణాలు విడిచినట్లు స్థానికులు తెలిపారు.

మృతుడు స్వామికి మతిస్థిమితం లేని కుమారుడు ఉన్నాడు. భార్య మంచం నుంచి లేవలేని పరిస్థితిలో ఉంది. ఈ క్రమంలో ఇంటి పెద్దదిక్కు మృతిచెందడంతో కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం ఆ పేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

1334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles