ఉరివేసుకొని వృద్ధ దంపతుల ఆత్మహత్య

Thu,June 9, 2016 08:48 PM

Old Couple suicide in Karimnagar district

కరీంనగర్ : అనారోగ్యంతో బాధపడుతున్న వృద్దదంపతులు జీవితంపై విరక్తితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ గ్రామంలో గుంటి మల్లయ్య(80), రాజవ్వ దంపతులు కొద్ది రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రులకు తీసుకెళ్లి కుమారుడు ఓదయ్య వైద్యం చేయించినా, ప్రయోజనం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకున్నారు.

వృద్ధ దంపతులు ఉంటున్న గది తలుపులు ఓదయ్య తెరిచి చూసేసరికి ఇద్దరూ ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ జక్కుల శంకర్‌రావు దంపతుల ఆత్మహత్యపై బంధువులను, గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఓదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఉరి వేసుకున్న దంపతుల మృతదేహాలను కింద పడుకోబెట్టడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వచ్చేసరికి మృతదేహాలను నేలపై పడుకోబెట్టారు.

1604
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles