మేడారం అండర్ ట‌న్నెల్‌ను సంద‌ర్శించిన‌ ప్రముఖులు

Sun,January 20, 2019 10:20 PM

officials Inspects Nandi Medaram Pump House

ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం శివారులో కాళేశ్వరం ప్రాజెక్ట్ 6వ ప్యాకేజీ అండర్ టన్నెల్‌ను ఆదివారం కరీంనగర్ డీఐజీ ప్రమోద్ కుమార్, టీఎస్‌పీఎస్‌సీ సభ్యుడు సి. విఠల్, ఉన్నత విద్య శాఖ కౌన్సిల్ వైస్ చైర్మన్ వి. వెంకట రమణ, రాష్ట్ర టీఎన్‌జీఓ అధ్యక్షుడు జగదీశ్, రిటైర్డు జడ్జి రాజేంద్ర కుమార్ బృందం సందర్శించింది. వీరు మొదట టన్నెల్‌లోని పంప్‌హౌస్‌ను పరిశీలించగా, ఇక్కడ జరుగుతున్న పంపుల పురోగతి గురించి ప్రాజెక్ట్ ఈఈ నూనె శ్రీధర్ వివరించారు.

ఇప్పటికే 2 పంపుల డ్రైరన్ పూర్తయిందనీ, మరో రెండు పంపులు సిద్ధమవుతున్నాయనీ వారికి వివరించారు. అనంతరం వారు సర్జ్‌ఫూల్ (నీటి నిల్వ ప్రదేశం)ను, జీఐఎస్ సబ్ స్టేషన్‌ను పరిశీలించారు. సబ్ స్టేషన్ ఆరు బయట కంటే టన్నెల్‌లో తక్కువ విస్తీర్ణంలో నిర్మించిన తీరు దాని విశిష్టత గురించి సదరు బృంద సభ్యులు ఇక్కడ ప్రాజెక్ట్ ఏఈ ఉపేందర్, ధర్మారం ఎస్‌ఐ కె. ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు.

1616
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles