‘అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి’

Thu,September 24, 2015 07:32 PM

officially konda lakshman bapuji celebrations

హైదరాబాద్: స్వాతంత్ర సమరయోధుడు, తొల తరం, మలి తరం తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈమేరకు ఇవాళ మంత్రి జోగు రామన్న సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆయన ఆదిలాబాద్ జిల్లాలో జన్మించినందుకు తనకెంతో గర్వంగా ఉందన్నారు. నేటి తరానికి బాపూజీ ఆదర్శనీయుడని పేర్కొన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో సెప్టెంబర్ 27, 1915న జన్మించారు. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్, నల్లగొండ జిల్లా చిన్న కొండూరు (ప్రస్తుతం భువనగిరి) అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహించారు. 1957 నుంచి 1960 వరకు సమైక్య రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 1960 నుంచి 1962 వరకు మంత్రి పదవిలో కొనసాగారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారు.

5921
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles