ఖని, కొత్తగూడెంలో సింగరేణి నర్సింగ్ కళాశాలలు

Sun,June 16, 2019 08:26 AM

Nursing Colleges in Kothagudem and Godavarikhani

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, భద్రాద్రి కొత్తగూడెంలో బీఎస్సీ నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మి క సంఘం టీబీజీకేఎస్ డిమాండ్ మేరకు యాజమాన్యం కోల్‌బెల్ట్ ఏరియా పరిధిలో రెండుచోట్ల నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందులో ఒకటి గోదావరిఖనిలో, మరొకటి కొత్తగూడెంలో ఏర్పాటు చేయనున్నట్టు శుక్రవారం టీబీజీకేఎస్‌తో జరిగిన స్ట్రక్చర్ (నిర్మాణాత్మక) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సంస్థ ఆధ్వర్యంలో స్కూల్స్, పాలిటెక్నిక్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలల నిర్వహిస్తుండగా, నర్సింగ్ కాలేజీ ఏర్పాటుపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles