ఎన్టీఆర్ రథసారథిగా 75 వేల కిలోమీటర్ల ప్రయాణం.. చివరికి ఇలా..!

Wed,August 29, 2018 09:58 AM

NTR Chaitanya Ratham have logged 75000 km driven by Harikrishna

1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగు ఆత్మగౌరవ నినాదంతో ఆయన రాష్ట్రమంతా కలియతిరిగారు. చైతన్య రథంపై 1983 ఎన్నికలకు ముందు ఏకంగా 75 వేల కిలోమీటర్లు ఎన్టీఆర్ ప్రయాణించారు. ఇదో గిన్నిస్‌బుక్ రికార్డు. ప్ర‌పంచంలో ఏ యాత్ర కూడా ఇంత సుదీర్ఘంగా సాగ‌లేదు. 9 నెల‌ల్లో నాలుగుసార్లు రాష్ట్రం మొత్తాన్ని చుట్టి వ‌చ్చారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఆ చైతన్య రథసారథి హరికృష్ణే. ఓ షెవర్లే కారును పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకొని యాత్ర చేశారు. అంత సుదీర్ఘ యాత్ర చేసి భారత రాజకీయాల్లో ఎన్టీఆర్ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించగా.. ఆ చైతన్య రథసారథిగా హరికృష్ణ కూడా అంతే పేరు సంపాదించారు. కొన్ని నెలల తరబడి అలుసుసొలుపు లేకుండా అన్ని వేల కిలోమీటర్లు డ్రైవింగ్ చేయడం హరికృష్ణకే సాధ్యమైంది.అందుకేనేమో ఇప్పుడు 61 ఏళ్ల వయసులోనూ సుదీర్ఘ ప్రయాణాలకు కూడా కారును సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం ఆయనకు ఓ అలవాటుగా మారింది. అయితే ఎంత అనుభవం ఉన్నా, ఎన్ని మెలకువలు తెలిసినా.. చిన్న పొరపాటు ఎంతటి విపత్తుగా దారితీస్తుందో చెప్పడానికి హరికృష్ణ ఉదంతమే నిదర్శనం. గంటకు సుమారు 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పడానికి క్షణకాలం చాలు. హరికృష్ణ విషయంలోనూ అదే జరిగింది. రెప్పపాటులోనే కారు డివైడర్‌ను ఢీకొట్టడం, పల్టీలు కొట్టడం జరిగిపోయాయి. అంతటి చైతన్య రథసారథి కూడా చివరికి రోడ్డు ప్రమాదంలో మరణించడం నిజంగా ఓ పెద్ద విషాదమే.

4991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles