గిరిజన విద్యార్థులకు ఎన్ఆర్ఐల మద్దతు

Thu,October 10, 2019 05:05 PM


హైదరాబాద్ : రాష్ట్ర గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పిలుపునకు మంచి స్పందన వస్తోంది. స్థానికులే కాదు ఎన్.ఆర్.ఐలు కూడా మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునందుకొని గిరిజన విద్యార్థులకు తాము చేదోడుగా ఉంటామని ముందుకు వస్తున్నారు.


నోకియా కార్పోరేషన్ ఆసియా సంస్థ హెడ్ జి.వి సత్యనారాయణ నాయక్, ఆయన సతీమణి శకుంతల కలిసి ఈ రోజు మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిసి గిరిజన విద్యార్థుల కోసం 100 బ్లాంకెట్లను అందించారు. ఇంకా గిరిజన విద్యార్థుల కోసం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం తమ సంస్థ తరపు నుంచి ఏమి చేయాలో సూచిస్తే కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి కింద చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్పోరేట్ ప్రతినిధులు తన పిలుపు మేరకు గిరిజన విద్యార్థులకు సాయం చేయడానికి ముందుకు రావడం పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ గారు హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజనుల కోసం కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని, ముఖ్యంగా విద్యార్థులకి సాయం చేయాలని కోరారు.

628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles