ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్‌లో రైల్ టికెట్

Wed,December 23, 2015 09:12 PM

Now, buy rail tickets on ICICI Bank website

ముంబై : ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా రైల్ టికెట్‌ను సైతం కొనుగోలు చేయవచ్చును. ఇందుకోసం బ్యాంక్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌తో(ఐఆర్‌సీటీసీ) ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్, ప్రిపెయిడ్ డిజిటల్ వాలెట్ సేవల ద్వారా రైల్వే ఈ-టికెట్‌ను బుకింగ్ చేసుకోవచ్చునని బ్యాంక్ వెల్లడించింది. వినియోగదారుడు తొలిసారి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రిజిస్టార్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

ఆ తర్వాత బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా టికెట్‌ను కొనుగోలు చేసేందుకు అవకాశం లభించనున్నది. ఈ సేవలు ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులతోపాటు ఇతర బ్యాంక్ కస్టమర్లకు కూడా వినియోగించుకోవచ్చును. డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరుపవచ్చును. రైల్ పూర్తి సమాచారంతోపాటు ఈ-టికెట్‌ను బుకింగ్, రద్దు చేసుకోవచ్చును, పీఎన్‌ఆర్ స్టేటస్‌ను కూడా ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చును.

1170
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles