నవంబర్ 7 వరకు పదో తరగతి ఫీజు గడువు

Tue,October 22, 2019 07:46 AM

హైదరాబాద్: మార్చిలో నిర్వహించే పదోతరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును నవంబర్ 7 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బీ సుధాకర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఉన్నది. దసరా సెలవుల పొడిగింపు, ఈ నెల 25 నుంచి సమ్మెటివ్-1 పరీక్షలు ఉన్నందున పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీని పొడిగించామని తెలిపారు. రూ.50 ఆలస్యరుసుంతో నవంబర్ 23 వరకు, రూ.200 ఆలస్యరుసుంతో డిసెంబర్ 9 వరకు, రూ.500 ఆలస్యరుసుంతో డిసెంబర్ 23 వరకు ఫీజు చెల్లింపునకు తేదీలు ప్రకటించామని చెప్పారు.

688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles