వైద్యకళాశాలల్లో ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్

Sun,June 16, 2019 08:46 AM

notification release for admissions in medical colleges Soon

వరంగల్ అర్బన్: రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో ప్రవేశాలకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని వరంగల్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే యూనివర్సిటీ తరఫున విద్యార్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ రిజర్వ్‌కోటా కింద ఆంధ్రప్రాంత విద్యార్థులు అర్హులు కావడం వల్ల ప్రస్తుత జాబితాలో వారిని చేర్చుతామని పేర్కొన్నారు. దీంతో ర్యాంకుల్లో మార్పు వస్తుందని, ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం పూర్తిస్థాయి మెరిట్ జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. నీట్-2019 ఫలితాల్లో ఇతర రాష్ర్టాల కన్నా తెలంగాణ విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచారని, నిరుడితో పోలిస్తే మార్కుల శాతంతోపాటు క్వాలిఫైడ్ విద్యార్థుల సంఖ్య కూడా పెరిగిందని అన్నారు. మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ రాసిన తెలంగాణ అభ్యర్థుల మార్కుల వివరాలను ఆయన వెల్లడించారు. మొదటి వెయ్యి ర్యాంకులోపు 43 మంది విద్యార్థులు తెలంగాణవారే ఉన్నారని తెలిపారు. రెండువేల ర్యాంకులోపు 69 మంది, ఐదువేల ర్యాంకులోపు 149 మంది, 10 వేల ర్యాంకులోపు 289 మంది, 20 వేల ర్యాంకులోపు 600 మంది, 25 వేల ర్యాంకులోపు 793 మంది, 30 వేల ర్యాంకులోపు 967 మంది, 35 వేల ర్యాంకులోపు 1,148 మంది, 40 వేల ర్యాంకు లోపు 1,331 మంది తెలంగాణ రాష్ర్టానికి చెందినవారున్నారని వివరించారు.

1096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles