ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Wed,June 20, 2018 09:45 PM

Notification issued for MBBS and BDS entries in kaloji narayana rao health university

వరంగల్: కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్ లైన్ దరఖాస్తుల నమోదుకు నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు కాళోజి యూనివర్సిటీ ఉప కులపతి డా. కరుణాకర్ రెడ్డి , రిజిస్ట్రార్ డా. ప్రవీణ్ కుమార్లు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2018లో అర్హత సాధించిన అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.in లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 8 గంటల నుండి 26వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారంకు యూనివర్సిటీ వెబ్ సైట్ లో చూసుకోవచ్చని తెలిపారు.

2565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles