పీజీ డెంటల్‌లో కన్వీనర్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

Fri,April 5, 2019 07:58 PM

notification issued for convenor quota seats in pg dental

-నేటి నుంచి 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
వరంగల్ అర్బన్: పీజీ డెంటల్ కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడానికి వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. పీజీ డెంటల్‌లో కటాఫ్ స్కోర్ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు కన్వీనర్ కోటాలో ఈ నెల 6 నుంచి 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. తగ్గిన కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని రిజిస్ట్రార్ డాక్టర్ దేవుపల్లి ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

రేపటి నుంచి ప్రైవేట్ డెంటల్ కళాశాలల్లో...


రాష్ట్రంలోని ప్రైవేట్ పీజీ మెడికల్, డెంటల్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటాలో సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు హెల్త్‌వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం నీట్ 2019లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని ఆయన సూచించారు.

631
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles