ఆస్తి కాదు... ఆరోగ్యం ముఖ్యం: మంత్రి హరీశ్‌రావు

Tue,August 21, 2018 08:59 PM

Not property health is important says Harish rao

సిద్దిపేట: మనకు ఎంత ఆస్తి ఉన్నదన్నది ముఖ్యం కాదు. మనం ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నామనేదే ముఖ్యమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో ఈ నెల 28న తలపెట్టిన సామూహిక హరితహారంపై మంత్రి నేడు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలోని 34 వార్డులో మొక్కలు నాటాలన్నారు. సిద్దిపేటలో 50 వేలు, సుడా పరిధిలో 1.50 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. రాష్ర్టాన్ని హరిత తెలంగాణాగా మార్చేందుకు సీఎం హరిత ఉద్యమం చేపట్టారన్నారు. ప్రకృతి బాగుంటేనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణమవుతుందన్నారు. చెట్లను విచక్షణారహితంగా నరకడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ఢిల్లీలాంటి నగరాల్లో ఆక్సిజన్ కొనుక్కొనే పరిస్థితి వచ్చిందని చెప్పారు. అడవుల్లో ఉండాల్సిన కోతులు పట్టణాలకు, గ్రామాలకు వచ్చాయన్నారు. సిద్దిపేట శివారులో 5 ఎకరాల్లో ఆక్సిజన్ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. సిద్దిపేటను హరిత సిద్దిపేటగా మార్చి హరిత శోభను తేవాలని పేర్కొన్నారు.

3155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles