నార్మల్ డెలివరీలే ‘దక్షత’ లక్ష్యం

Sat,May 18, 2019 10:18 AM

normal delivery Dakshata Health and Family Welfare Department torget

హైదరాబాద్ : మాతా శిశు మరణాల శాతాన్ని తగ్గిస్తూ, ప్రభుత్వ దవాఖానల్లోనే ఎక్కువ ప్రసవాలు జరిగేలా చూడాలనే ఉద్దేశంతో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ‘దక్షత’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. సిజేరియా ప్రసవాలు అరికట్టి , ప్రభుత్వ దవాఖానల్లోనే వంద శాతం నార్మల్ డెలివరీలు అయ్యేలా చూడాలని ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా రెండేండ్ల క్రితం ‘దక్షత’ పేరిట ప్రభుత్వ దవాఖానల్లో పలు సంస్కరణలు అమలు చేసింది. ప్రసవాలు ఎక్కువ జరిగే జిల్లా దవాఖానలు, ఏరియా దవాఖానలు, కమ్యూనిటీ దవాఖానాలు, ఎంసీహెచ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్పెషాలిటీ వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులకు దక్షత కార్యక్రమం ద్వార శిక్షణ ఇస్తున్నారు.

గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆయా దవాఖానల మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులకు ‘దక్షత’ పేరిట సాధారణ ప్రసవాల్లో నైపుణ్యాలు, మెలుకువలపై శిక్షణ అందించగా మిగిలిన వారికి ఈ నెల 13 నుంచి 18 వరకు రెండు బ్యాచ్‌లుగా విభజించి శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని స్పెషాలిటీ వైద్యులు, స్టాఫ్ నర్సులకు దక్షత శిక్షణ అందిస్తున్నారు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ఒక బ్యాచ్ పూర్తయింది. రెండో బ్యాచ్ ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా దవాఖానలో దక్షత శిక్షణను ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 12 మంది మెడికల్ ఆఫీసర్లు, 12 మంది స్టాప్ నర్సుల చొప్పున మొత్తం 24 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ విధంగా రెండు బ్యాచ్‌ల్లో 48 మంది వైద్యులు, స్టాప్ నర్సులకు శిక్షణ ఇస్తున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి 8 మంది వైద్యులు, 8 మంది స్టాఫ్ నర్సుల చొప్పున రెండు బ్యాచ్‌లకు గాను ఎంపిక చేశారు.

‘దక్షత’లో సాధారణ కాన్పుల నైపుణ్యాలపై శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ పొందిన ఇద్దరు డీపీహెచ్‌ఎన్‌ఓ, ఇద్దరు మెడికల్ ఆఫీసర్ల ట్రైనర్ల సమక్షంలో శిక్షణ కొనసాగుతున్నది. ముఖ్యంగా శిక్షణ ద్వారా నార్మల్ డెలివరీల్లో మెళకువలు, హై రిస్క్ కేసుల గుర్తింపు, కాన్పు నార్మల్ అవుతదా...? లేదా.. అనే దానిపై ముందే అంచనా వేయడం , ఫ్రీ అసెస్‌మెంట్, పోస్ట్ అసెస్‌మెంట్, అప్పుడే జన్మించిన శిశువు సంరక్షణ, పుట్టిన బిడ్డ ఏడిస్తే తీసుకోవాల్సన జాగ్రత్తలు, ఏడువకపోతే తీసుకోవాల్సిన రెఫరల్ కేర్ తదితర సమస్యలపై దవాఖానలో గర్భిణుల ప్రవేశం పొందినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన నాణ్యమైన వైద్య సేవలు, చికిత్సల్లో మెళకువలు నేర్పుతున్నారు. జిల్లా దవాఖానలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దక్షత శిక్షణ అందిస్తున్నారు.

1072
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles