నాగార్జున సాగర్‌లో జానారెడ్డి ఓటమి ఖాయం: నోముల

Sun,September 9, 2018 01:31 PM

nomula narsimhaiah  Fires On Jana Reddy

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నారని నాగార్జున సాగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. జానారెడ్డి అన్న మాట ప్రకారం టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేయాలని ఆరోపించారు. బత్తాయి రైతులు ఆనందరంగా ఉన్నారా? లేరా? అనే విషయాన్ని జానారెడ్డే చెప్పాలని మండిపడ్డారు. జానారెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వస్తే టిక్కెట్ త్యాగం చేస్తానని సవాల్ విసిరారు.

ఎన్నికలంటేనే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు. కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నది కాంగ్రెస్ నేతలు కాదా? అని ప్రశ్నించారు. ప్రజా తీర్పు కోసం శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుంది. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి ఓటమి ఖాయం అని వివరించారు.

3443
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles