రెండో విడుత నామినేషన్లు నేటితో ముగింపు

Sun,January 13, 2019 09:00 AM

nominations have begun on Friday the last date for nominations is January 13

హైదరాబాద్: రెండో విడుత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ఆదివారం సాయంత్రం ఐదు గంటలతో ముగుస్తుంది. రెండో విడుత నామినేషన్ల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభమయింది. మొదటిరోజున 4,135 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు 4,850 నామినేషన్లు దాఖలుకాగా.. 36,602 వార్డులకు 9,198 నామినేషన్లు దాఖలయ్యాయి.

రెండోరోజైన శనివారం నాడు సర్పంచ్ స్థానాలకు 5,595, వార్డు స్థానాలకు 20,973 నామినేషన్లు దాఖలైనట్టు అనధికార సమాచారం. కరీంనగర్ జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 199, వార్డు స్థానాలకు 970 నామినేషన్లు దాఖలయ్యాయి. మంచిర్యాల జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 174, వార్డు సభ్యులకు 457, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 192, వార్డు స్థానాలకు 626, జిగిత్యాల జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 244, వార్డు స్థానాలకు 838, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 267, వార్డు స్థానాలకు 1294 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 295, వార్డు స్థానాలకు 1065, నాగర్‌కర్నూల్ జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 176, వార్డు స్థానాలకు 701, వనపర్తి జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 170, వార్డు స్థానాలకు 509, జోగుళాంబ గద్వాల జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 109, వార్డు స్థానాలకు 502 నామినేషన్లు దాఖలయ్యాయి.

సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 157, వార్డులకు 706నామినేషన్లు దాఖలయ్యాయి. నిర్మల్ జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 134, వార్డులకు 583, ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 151, వార్డులకు 519, నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 187, వార్డులకు 953, కామారెడ్డి జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 253, వార్డులకు 1017 నామినేషన్లు దాఖలయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 126, వార్డులకు 415 , భువనగిరి జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 141, వార్డు మెంబర్‌కు 256 నామినేషన్లు దాఖలయ్యాయి. రిటర్నింగ్ అధికారులు సోమవారంనాడు నామినేషన్లను పరిశీలించి, అదేరోజు అర్హత సాధించిన నామినేషన్ల జాబితాను విడుదలచేస్తారు.

1082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles