హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. గడువు ముగిసేలోగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లోకి చేరుకున్న వారు నామపత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. నామినేషన్లకు చివరిరోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. రేపు అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 28 వరకు తుదిగడువు ఉంది. రాష్ట్రంలో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నామినేషన్ల సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా నామినేషన్ల గడువు ముగిసింది. ఏపీలో 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.