పరిషత్ పోరు.. ప్రారంభమైన రెండో విడుత నామినేషన్ల స్వీకరణ

Fri,April 26, 2019 12:18 PM

nominations for mptc and zptc elections started in 31 districts

హైదరాబాద్: పరిషత్ ఎన్నికల రెండో విడుత నామినేషన్ల పర్వం మొదలైంది. ఉదయం 11.30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. రెండో విడుతగా 31 జిల్లాల పరిధిలోని 180 జెడ్పీటీసీ స్థానాలు, 1,913 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు ఇవాళ నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో 31 జిల్లాల పరిధిలో పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు.

నల్గొండ జిల్లా త్రిపురారం జెడ్పీటీసీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్ల సుశీలాచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ జిల్లా ముకుందాపురం ఎంపీటీసీ స్థానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి నూకల రాధిక నామినేషన్ సమర్పించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈసందర్భంగా కార్యాలయాన్ని ఏసీపీ మనోహర్ రెడ్డి సందర్శించి.. నామినేషన్ల పర్వాన్ని పరిశీలించారు.

825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles