స్పీకర్ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

Thu,January 17, 2019 05:44 PM

Nominations end for telangana Speaker election


హైదరాబాద్ : శాసనసభాపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికను రేపు అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అసెంబ్లీలో సీఎం చాంబర్ కు వెళ్లి దన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పదవికి టీఆర్ఎస్ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు విపక్ష నేతలు హాజరయ్యారు. సభాపతిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి గారి అభ్యర్థిత్వానికి అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

2304
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles