వెలవెలబోయిన ‘భట్టి’ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర

Mon,May 20, 2019 06:11 AM

no response for Bhatti Vikramarka Road Show at NTR Nagar

హైదరాబాద్ : ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్‌నగర్‌లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ శాసన సభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర, రోడ్‌షో వెలవెలబోయింది. యాత్రలో పాల్గొన్న భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రజలను మోసం చేసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యాత్రకు జనం కరువు
ఆదివారం రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిర్వహంచిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర, రోడ్డు షో జనం లేక వెలవెలబోయింది. ఎన్టీఆర్‌నగర్ చింతచెట్ల వద్ద నిర్వహించిన సమావేశానికి అతి తక్కువ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఊహించిన స్థాయిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాకపోవడంతో భట్టివిక్రమార్క అసహనం వ్యక్తం చేశారు.

ఫ్లెక్సీలు చించివేసిన భాస్కర్‌రెడ్డి అనుచరులు..
ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర ,రోడ్‌షోకు మహేశ్వరం నాయకుడు దేప భాస్కర్‌రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడంతోఅతడి అనుచరులు డివిజన్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. ఈ సందర్భంగా ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి భట్టివిక్రమార్క వస్తే డివిజన్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర, రోడ్డుషో కార్యక్రమం నిర్వహించడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బండి మధుసూదన్‌రావు, పున్న గణేశ్, ధన్‌రాజుగౌడ్, శేఖర్, సైదులు, ఉపేందర్‌రెడ్డి, జ్ఞాన్వేశ్వర్, శ్రీకాంత్, మల్లేశ్ పాల్గొన్నారు.

2225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles