ప్రతిపక్ష పార్టీలకు భవిష్యత్ లేదు: మ‌ంత్రి ఐకే రెడ్డి

Tue,September 18, 2018 05:43 PM

no future to Opposition parties says minister Indrakaran reddy

నిర్మ‌ల్: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు భవిష్యత్ లేదని, సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో టీఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతున్నదని గృహ నిర్మాణ‌,న్యాయ‌,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని సారంగాపూర్ మండలం తాండ్ర‌, ఆలూరు, ప్ర‌తాప్ న‌గ‌ర్, దిలావ‌ర్ పూర్ మండ‌లం కాల్వ గ్రామాల‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరినవారికి మంత్రి అల్లోల‌ కండువా కప్పి టీఆర్‌ఎస్ లోకి సాద‌రంగా ఆహ్వానం ప‌లికారు.ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయని పథకాలు సీఎం కేసీఆర్ చేస్తున్నార‌న్నారు.

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతిపక్షాలకు భయం పట్టుకుందన్నారు. 60 ఏళ్ల కాలంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేని నాయకులు ప్రస్తుతం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణ‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో పెద్దఎత్తున చేరుతున్నారని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న‌ తెలంగాణ‌ను అన్ని విధాల అభివృద్ది చేసుకుని...బంగారు తెలంగాణ దిశ‌గా ముందుకు సాగాలంటే మ‌ళ్లీ టీఆర్ఎస్ కే ప‌ట్టం క‌ట్టాల‌ని కోరారు. కార్యక్రమంలోనిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్తలు పాల్గొన్నారు.

1316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles