ఈవీఎంల‌పై అనుమానాలు లేవు : టీఆర్ఎస్‌

Wed,May 22, 2019 05:59 PM

No doubt about genuineness of results using EVMs: TRS

హైద‌రాబాద్‌: ఈవీఎంల‌పై త‌మ‌కు అనుమానాలు లేవ‌ని టీఆర్ఎస్ వెల్ల‌డించింది. ఈవీఎంల‌తో పాటు వీవీప్యాట్ల‌ను కూడా పూర్తిగా లెక్కించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్న నేప‌థ్యంలో.. ఆ అంశంపై ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర రెడ్డి స్పందించారు. ఓ వార్తాసంస్థ‌తో ఆయ‌న మాట్లాడుతూ ఈవీఎంల ప‌నితీరుపై త‌మ‌కు సందేహాలు లేవ‌న్నారు. గ‌తంలో కొన్ని సందేహాలు వ్యక్తం చేశాం, అప్పుడు ఈసీ మా అనుమానాల‌ను నివృత్తి చేసింద‌ని, ఈవీఎంల‌తో జ‌రిగిన కొన్ని ఎన్నిక‌ల్లో మేం గెలిచాం, కొన్ని ఓడామ‌ని ఎమ్మెల్సీ రాజేశ్వ‌ర్‌రెడ్డి తెలిపారు. ఈవీఎంల‌పై పూర్తి సంతృప్తితో ఉన్నామ‌ని, ఫ‌లితాలు ఎలా వ‌చ్చినా మేం స్వాగ‌తిస్తామ‌ని, ఫ‌లితాల‌ను ప్ర‌జాతీర్పుగా భావిస్తామ‌ని తెలిపారు.

1018
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles