తాండూరు శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న‌ది: ఎంపీ క‌విత‌

Sat,August 26, 2017 02:04 PM

Nizamabad MP Kavitha visited Vikarabad district today

వికారాబాద్: జిల్లాలో ఇవాళ ఎంపీ క‌విత ప‌ర్య‌టించారు. తాండూరులోని జినుగుర్తిలో సెంట‌ర్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రీసెర్చ్ ట్రెయినింగ్ సెంట‌ర్ ప‌నుల‌ను ఇవాళ ఎంపీ క‌విత ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి, కేంద్ర మంత్రి బండారు ద‌త్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఎంపీ క‌విత‌... తాండూరు శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న‌ద‌న్నారు. తాండూరు లో కంది బోర్డు ఏర్పాటు కోసం పార్ల‌మెంట్ లో చ‌ర్చిస్తామ‌ని ఆమె తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో స‌మ‌గ్రాభివృద్ధికి అవ‌కాశం క‌లిగింద‌ని ఆమె చెప్పారు.

ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు నిజ‌మైన ల‌బ్ధిదారుల‌కు చేర‌డం చాలా అవ‌స‌రం... రైతులు త‌ప్ప‌కుండా భూసార ప‌రీక్ష‌లు చేయించాలి...సాయిల్ హెల్త్ కార్డ్ ల నిర్వ‌హ‌ణ‌లో తెలంగాణ ప్ర‌భుత్వం ముందుంది.. కేంద్ర మంత్రి బండారు ద‌త్తాత్రేయ‌

3047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles